*మన గవర కులస్థులు OTHER BACKWARD CASTE(O.B.C) వర్గీకరణలో ఏ గ్రూప్ లో ఉండబోతున్నారు????*
*మన గవర కుల పెద్దలు,గవర రాజకీయ నాయకులు ప్రత్యేక శ్రద్ద,చొరవ తీసుకొని మన గవర కులస్థులని సముచిత O.B.C గ్రూప్ లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని విన్నపం*
*రోహిణి కమిషన్:*
రోహిణి కమిషన్ OTHER BACKWARD CASTE(O.B.C) లో వర్గీకరణకి 2017 లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్
O.B.C వర్గీకరణ అనగా O.B.C కులాల ని O.B.C(A) ;O.B.C(B) ;O.B.C(C) ;
O.B.C(D) లు గా విభజిస్తారు
O.B.C అంటే OTHER BACKWARD CASTE
OTHER BACKWARD CASTE(O.B.C)ల కి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధలు,కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు,కేంద్ర ప్రభుత్వ విద్యాలయాలలో 27 % రిజర్వేషన్ 1992 సంవత్సరం నుండి అమలు అవుతున్నాయి
మన గవర కులస్థులు OTHER BACKWARD CASTE(O.B.C) లోకి వస్తారు
మన గవర కులస్థుల OTHER BACKWARD CASTE(O.B.C) సీరియల్ నెంబర్ 66 గా కేంద్ర ప్రభుత్వ గెజిట్ లో నమోదయింది
రోహిణి కమిషన్ 16 ఫిబ్రవరి,2021 సంవత్సరంలో వెల్లడించిన ప్రెస్ మీట్ లో :
27% OTHER BACKWARD CASTE(O.B.C) రిజర్వేషన్ ని
O.B.C(A) కి 2%
O.B.C(B) కి 6%
O.B.C(C) కి 9%
O.B.C(D) కి 10% గా విభజిస్తున్నట్లు ప్రకటించింది
అయితే ఏ కులం ని ఏ గ్రూప్ లో పెట్టింది ఇంకా ప్రకటించలేదు,”రోహిణి కమిషన్” తుది నివేదిక 2021 సంవత్సరం జులై 31న రాష్ట్రపతికి సమర్పించాలి.
:రోహిణి కమిషన్” 16 ఫిబ్రవరి,2021 సంవత్సరంలో వెల్లడించిన ప్రెస్ మీట్ లో :
O.B.C(A) క్రింద 2% రిజర్వేషన్ 1,674 కులాలకు వర్తిస్తాది ,వీరిలో ఇప్పటి వరకూ ఎక్కువగా O.B.C రిజర్వేషన్ పొందలేదు,ఇందులో 1000 కులాల నుండి అయితే ఒక్కరు కూడా O.B.C రిజర్వేషన్ ఇప్పటివరకూ పొందలేదు,ఈ గ్రూప్ లో జనాభా తక్కువ,ఈ గ్రూప్ లో ఉన్న కులాలులో చాలా తక్కువ మంది జనాభా ఉంటారు
O.B.C(B) క్రింద 6% రిజర్వేషన్ 534 కులాలకు వర్తిస్తాది ,వీరిలో ఇప్పటి వరకూ చాలా తక్కువ మంది O.B.C రిజర్వేషన్ పొందారు
O.B.C(C) క్రింద 9% రిజర్వేషన్ 328 కులాలకు వర్తిస్తాది ,వీరిలో ఇప్పటి వరకూ కొంచెం ఎక్కువ మంది O.B.C రిజర్వేషన్ పొందారు
O.B.C(D) క్రింద 10% రిజర్వేషన్ 97 కులాలకు వర్తిస్తాది ,వీరిలో ఇప్పటి వరకూ చాలా ఎక్కువ మంది O.B.C రిజర్వేషన్ పొందారు,ఈ గ్రూప్ లో చాలా ఎక్కువ జనాభా ఉన్న కులాలు ఉన్నాయి,ఈ గ్రూప్ లో కులాలు O.B.C లో ఆధిపత్య కులాలు,ఈ గ్రూప్ లో జనాభా ఎక్కువ
“రోహిణి కమిషన్” O.B.C లో ఉన్న అన్ని కుల సంఘాలుతో,రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రజాభిప్రాయ సేకరణకి మార్చి నెల 2021 నుండి వివిధ రాష్ట్రాలలో పర్యటిస్తారు,మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోహిణి కమిషన్ పర్యటనకు వచ్చినపుడు మన గవర కుల పెద్దలు,మన గవర రాజకీయ నాయకులు ప్రత్యేక శ్రద్ద,చొరవ తీసుకొని మన గవర కులస్థులని సముచిత O.B.C గ్రూప్ లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని విన్నపం.
రోహిణి కమీషన్ O.B.C లో మన గవర గ్రూప్ ని ఏ గ్రూప్ లో చేర్చితే, రోహిణి కమీషన్ నివేదిక ప్రకారం భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విద్య,ఉద్యోగాలు లో కల్పించే 29% Backward class(B.C) రిజర్వేషన్ లలో అమలుచేసే అవకాశం ఉంది, రోహిణి కమీషన్ నివేదిక ప్రకారం BC(A); BC(B); BC(C); BC(D) గ్రూప్ లో పెట్టే అవకాశం ఉంది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విద్య,ఉద్యోగాలు లో కల్పించే Backward class(B.C) రిజర్వేషన్ లలో ప్రస్తుతం మన గవర కులస్థులు BC(D) గ్రూప్ లో ఉన్నాము,ఈ గ్రూప్ లో చాలా అధిక జనాభా కలిగిన కులాలు చాలా ఉన్నాయి,ఈ గ్రూప్ లో చాలా కులాలు ఉన్నాయి,ఈ గ్రూప్ లో Backward class(B.C)లో ఆధిపత్యం కలిగిన కులాలు చాలా ఉన్నాయి,అందువలన మన గవర కులస్థులు అన్ని కులాలతో పోటీ పడలేకపోతున్నారు,రిజర్వేషన్ ఫలాలు అనుకున్న స్థాయిలో పొందలేకపోతున్నాము,BC(D) గ్రూప్ నుండి BC(A) లోకి కానీ BC(B) లో కి కానీ మార్చమని మన గవర కులస్థులు అధికంగా డిమాండ్ చేస్తున్నారు,అందుకు అనుగుణంగా రాజకీయ పార్టీలు కూడా వాటి మేనిఫెస్టోలో ఈ డిమాండ్ ని పెడుతున్నాయి ,
మన గవర కులస్థుల జనాభా ఆంధ్రప్రదేశ్ లో అధికారిక లెక్కల ప్రకారం ఐదు లక్షల ఇరవై వేలు మాత్రమే
ఇదే సంఖ్యలో BC(A); BC(B) లో ఉన్న ఇతర కులాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న రిజర్వేషన్లు ద్వారా అధికంగా లబ్ధి పొందుతున్నారు
రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విద్య,ఉద్యోగాలు లో కల్పించే Backward class(B.C) రిజర్వేషన్ లలో ప్రస్తుతం మన గవర కులస్థులు BC(D) గ్రూప్ లో ఉన్న కారణంగా “రోహిణి కమీషన్” ఆ విషయం పరిగణనలోకి తీసుకొని మన గవర కులస్థులు ని, BC(D) గ్రూప్ లో ఉన్న ఇతర కులాలతో కలిపి O.B.C గ్రూప్ లో పెడితే మన గవర కులస్థులు చాలా ఎక్కువగా నష్టపోతారు,ఎందుకంటే ఈ కులాలు అధిక జనాభా కలిగిన కులాలు,బాగా అభివృద్ది చెందిన కులాలు
మనం ఇప్పుడు మేల్కొని “రోహిణి కమీషన్” ను కలిసి మన వెనుకబాటుతనంని ఆధారాలతో వివరించకపోతే OTHER BACKWARD CASTE(O.B.C)లో బాగా అభివృద్ది చెంది అధిక జనాభా ఉండే కులాలు ఉండే O.B.C గ్రూప్ లో పెడితే మన గవర కులస్థులు రిజర్వేషన్ ఫలాలు అనుకున్న స్థాయిలో పొందలేరు,ఇప్పుడు మేల్కొనకపోతే మన గవర జాతికి ఎంతో కీడు చేసిన వాళ్లము అవుతాము,మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో “రోహిణి కమిషన్” పర్యటనకు వచ్చినపుడు మన గవర కుల పెద్దలు,మన గవర రాజకీయ నాయకులు ప్రత్యేక శ్రద్ద,చొరవ తీసుకొని మన వెనుకబాటుతనంని సాక్ష్యాధారాలతో చూపించి మన గవర కులస్థులని సముచిత O.B.C గ్రూప్ లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని విన్నపం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కి కూడా మన గవర కుల పెద్దలు,మన గవర రాజకీయ నాయకులు మన వెనుకబాటుతనం తెలుపుతూ ఒక వినతి పత్రం ఇవ్వాల్సిన అవసరం ఉంది,ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నివేదికను కూడా “రోహిణి కమిషన్” పరిగణనలోకి తీసుకుంటుంది
ఐదుగురు సభ్యులు గల “రోహిణి కమీషన్”కు చైర్మన్ అయిన జస్టీస్ శ్రీమతి రోహిణి గారు తెలుగువారు, వారి స్వస్థలం విశాఖపట్టణం
ఈ మెసేజ్ ని ప్రతీ గౌరీయుడికి చేరే విధంగా షేర్ చెయ్యండి
ఇట్లు
భీమరశెట్టి ఉపేంద్ర గవర
మొబైల్/వాట్సప్ నెంబరు:9441212278