*రథసప్తమి మహా తేజం…*
శ్రీకాకుళం జిల్లా అరసవల్లి లో సూర్యదేవుని విశిష్టత..
జనవరి నెల 24 వతేదీన 2018 రధసప్తమి (సూర్యజయంతి).
మన ఆథ్యాత్మిక గ్రంథాల ప్రకారం *మొత్తం 12 మంది సూర్యులు.*
ఏడాదిలోని *ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత* వహిస్తాడు.
1. *చైత్ర మాసంలో* వచ్చే సూర్యుడి పేరు *‘ధాత’,*
2. *వైశాఖంలో అర్యముడు,*
3. *జ్యేష్టం-మిత్రుడు,*
4. *ఆషాఢం-వరుణుడు,*
5. *శ్రావణంలో ఇంద్రుడు,*
6. *భాద్రపదం-వివస్వంతుడు,*
7. *ఆశ్వయుజం-త్వష్ణ,*
8. *కార్తీకం-విష్ణువు,*
9. *మార్గశిరం- అంశుమంతుడు,*
10. *పుష్యం-భగుడు,*
11. *మాఘం-పూషుడు,*
12. *ఫాల్గుణం-పర్జజన్యుడు.*
ఆ నెలల్లో *సూర్యుడి తీక్షణతను బట్టి ఆ పేర్లు* వచ్చాయని చెబుతారు.
*భూమి నుంచి 14.98 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని కిరణాల ప్రయాణ వేగం ఒక సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు. అవి భూమిని చేరడానికి పట్టే కాలాన్ని 8 నిమిషాలుగా అంచనా కట్టారు ఖగోళ శాస్త్రవేత్తలు.*
బాల్యంలో హనుమంతుడు సూర్యుణ్ణి పండు అనుకుని తిందామనే ఉద్దేశంతో అక్కడికి ఎగిరి వెళ్లాడట. అందుకోసం *హనుమ వెళ్లిన దూరాన్ని ‘యుగ సహస్ర యోజన పరాభాను’ అని తులసీదాస్ హనుమాన్ చాలీసాలో చెబుతారు.*
దీన్ని లెక్క కడితే… ‘యుగం.. 12000 ఏళ్లు, సహస్రం.. 1000, యోజనం.. 8 మైళ్లు, మైలు… 1.6 కిలోమీటర్లు వెరసి దాదాపు 15 కోట్ల కిలోమీటర్లు. ఇది *ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్న 14.98 కోట్ల కిలోమీటర్లకు దాదాపు సరిపోతుంది.*
సూర్యకాంతి *ఏడు వర్ణాల కలయిక* అని వైజ్ఞానికులు చెబుతుంటే,
ఆయన *ఏడు గుర్రాలున్న రథం* మీద లోక సంచారం చేస్తాడని వేదవాజ్మయం చెబుతోంది.
ఆ ఏడు గుర్రాల పేర్లు
1. *గాయత్రి,*
2. *త్రిష్ణుప్పు,*
3. *అనుష్టుప్పు,*
4. *జగతి,*
5. *పంక్తి,*
6. *బృహతి,*
7. *ఉష్ణిక్కు…*
*వీటి రూపాలు సప్త వర్ణాలకు సరి* పోలుతాయి.
రామరావణ యుద్ధం సమయంలో అలసిపోయిన *శ్రీరాముడికి అగస్త్య మహాముని ‘ఆదిత్య హృదయం’ ఉపదేశించినట్లు* రామాయణంలో ఉంది.
ఇందులో 30 శ్లోకాలున్నాయి. వీటి *స్మరణ వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుందని చెబుతారు.*
*సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు పగలు, రాత్రికి ప్రతీక అని, చక్రాలకున్న ఆరు ఆకులు రుతువులకు, ధ్వజం ధర్మానికి ప్రతీకలని పురాణాల్లో ఉంది.*
అందుకే *సూర్యుడి జన్మదినాన్ని ఆయన పేరుతో కాకుండా రథ సప్తమి* అని పిలుస్తారు.